అతి పెద్ద బంగారం కంపెనీ కొనుగోలు | Rajesh Exports Buys World's Largest Gold Refining Firm for $400 Million | Sakshi
Sakshi News home page

అతి పెద్ద బంగారం కంపెనీ కొనుగోలు

Jul 27 2015 3:41 PM | Updated on Sep 3 2017 6:16 AM

ముంబైకి చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని కొనుగోలు చేసింది. దాదాపు 2,540 కోట్ల రూపాయల విలువైన ఈ డీల్తో తమ కంపెనీ ప్రతిష్ట మరింత పెరగునుందని కంపెనీవర్గాలు సోమవారం ప్రకటించాయి.

ముంబై:  ముంబైకి చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్  లిమిటెడ్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద  గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. దాదాపు 2,540  కోట్ల  రూపాయల విలువైన ఈ డీల్తో తమ కంపెనీ ప్రతిష్ఠ మరింత పెరగనుందని కంపెనీవర్గాలు సోమవారం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం సరఫరా కంపెనీలను పరిశీలించిన మీదట న్యూ మాంట్ మైనింగ్  కార్పొరేషన్ కు చెందిన వాల్కాంబీ కంపెనీని ఎంచుకున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కంపెనీ ముడి బంగారం,  బంగారు నగల తయారీలో ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు.  దీంతో తమ కంపెనీ లాభాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు.   

కాగా ప్రపంచంలో  బంగారం వినియోగంలో భారతదేశం అతి పెద్దదిగా పేరు గాంచింది భారత్.  ఏడాదికి సుమారు 900 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతున్నట్టు  సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement