మాటల కంటే చేతలే చెబుతాయి.. | Rahul Bhatia Comments on Rakesh Gangwal | Sakshi
Sakshi News home page

మాటల కంటే చేతలే చెబుతాయి..

Aug 28 2019 8:47 AM | Updated on Aug 28 2019 8:47 AM

Rahul Bhatia Comments on Rakesh Gangwal - Sakshi

న్యూఢిల్లీ: రాకేశ్‌ గంగ్వాల్‌ మాటల కంటే చేతలే పెద్దగా చెప్పగలవని ఇండిగో మరో సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ భాటియా అన్నారు. ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. సంస్థలో కార్పొరేట్‌ పాలనా పరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రిలేటెడ్‌ పార్టీ లావాదేవీలు (ఆర్‌పీటీ) జరుగుతున్నాయంటూ ఈ ఏడాది జూలైలో సెబీకి గంగ్వాల్‌ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఆరోపణలను భాటియా గ్రూపు ఖండించింది కూడా. గవర్నెన్స్‌ ఇండియా డాట్‌ కామ్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించి అందులో గంగ్వాల్‌ తన ప్రకటనలు పోస్ట్‌ చేస్తున్నారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ‘‘కొంత కాలానికి ఆయన వెబ్‌సైట్‌ కంటే ఆయన చర్యలే ఎక్కువగా తెలియజేస్తాయని భావిస్తున్నా. ఇండిగో తనంతట తాను నిలదొక్కుకునే స్థాయికి చేరుకుంది’’ అని ఇండిగో వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా భాటియా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement