ఐడియాలో 3.4 % వాటా విక్రయించిన ప్రావిడెన్స్ సంస్థ | Providence Equity to sell 3.47% stake in Idea Cellular | Sakshi
Sakshi News home page

ఐడియాలో 3.4 % వాటా విక్రయించిన ప్రావిడెన్స్ సంస్థ

Jun 4 2016 1:46 AM | Updated on Sep 4 2017 1:35 AM

ఐడియాలో 3.4 % వాటా విక్రయించిన ప్రావిడెన్స్ సంస్థ

ఐడియాలో 3.4 % వాటా విక్రయించిన ప్రావిడెన్స్ సంస్థ

ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌రూ.1,388 కోట్లకు విక్రయించింది.

న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌రూ.1,388 కోట్లకు విక్రయించింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా మొత్తం 12.50 కోట్ల షేర్ల(3.47% వాటా)ను ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్ తన ఇన్వెస్ట్‌మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్‌మెంట్(మారిషస్) ద్వారా విక్రయించింది. మార్చి క్వార్టర్ నాటికి ఐడియా సెల్యులర్‌లో ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థకు 6.8% వాటా ఉంది.

మరో వైపు మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ సంస్థ ఐడియా సెల్యులర్‌కు చెందిన 6.66 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.736 కోట్లకు కొనుగోలు చేసింది.  2014, సెప్టెంబర్‌లో ప్రావిడెన్స్ సంస్థ 2.4% వాటాను రూ.1,414 కోట్లకు విక్రయించింది. భారత్‌లో మూడవ అతి పెద్ద టెలికం ఆపరేటర్‌గా ఉన్న ఐడియా సెల్యులర్ వినియోగదారుల సంఖ్య 16 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement