నేడు, రేపు గృహ ప్రవేశం | Property in India, Buy, Sell, Rent Properties, Real Estate India | Sakshi
Sakshi News home page

నేడు, రేపు గృహ ప్రవేశం

Jun 23 2017 10:38 PM | Updated on Sep 5 2017 2:18 PM

నేడు, రేపు గృహ ప్రవేశం

నేడు, రేపు గృహ ప్రవేశం

ఇండియా ప్రాపర్టీ.కామ్‌ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో గృహ ప్రవేశం పేరిట 96వ ప్రాపర్టీ షో జరగనుంది.

హైటెక్స్‌లో ఇండియా
ప్రాపర్టీ.కామ్‌ ప్రాపర్టీ షో


సాక్షి, హైదరాబాద్‌: ఇండియా ప్రాపర్టీ.కామ్‌ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో గృహ ప్రవేశం పేరిట 96వ ప్రాపర్టీ షో జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరగనున్న ఈ షోలో నగరానికి చెందిన 65కి పైగా నిర్మాణ సంస్థలు.. 250కి పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నాయి. అపర్ణా, ఆదిత్య, రాంకీ, ఎస్‌వీసీ, ఎన్‌సీసీ అర్బన్, సైబర్‌సిటీ, హిల్‌కౌంటీ, ప్రెస్టిజ్, శ్రీ ఆదిత్య హోమ్స్, కె రహెజా కార్ప్, వెర్టెక్స్‌ హోమ్స్, త్రిశూల, సత్వా, ఎస్‌ఎంఆర్, ప్రణీత్‌ గ్రూప్, ఎంపైర్‌ డెల్టా, వెస్ట్రన్‌ కన్‌స్ట్రక్షన్స్, ముప్పా, అక్యురేట్‌ గ్రీన్‌ మిడోస్, రాజపుష్ప, ఆకృతి వంటి నిర్మాణ సంస్థలకు చెందిన ప్లాట్లు, ఫ్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలుంటాయి.

ప్రదర్శనకు కుటుంబంతో కలిసి వచ్చేవారి స్టాళ్లను సందర్శించేందుకు వీలుగా పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్‌ ప్లే ఏరియాను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌ అభివృద్ది గురించి చెప్పాలంటే.. ఇటీవలే ఏసియా పసిఫిక్‌ రీజియన్‌లో రియల్టీ పెట్టుబడులో నగరం మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఇతర నగరాల్లో ఐటీ రంగం ప్రతికూలంగా ఉంటే హైదరాబాద్‌లో మాత్రం కార్యాలయాల లీజు/కొనుగోలు కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రతీ ఏటా కార్యాలయాల అద్దెలూ పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement