‘ఆ వాహనాలకు చెల్లు’

Policy to scrap 15 yrs old vehicles almost finalised: Nitin Gadkari - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 15 ఏళ్లకు పైబడిన వాహనాల వాడకాన్ని నిషేధిస్తూ త్వరలోనే ఓ విధానాన్ని తీసుకువస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతుందన్నారు. దీనిపై ఇప్పటికే నీతిఆయోగ్‌తో ఈ వాహనాలను తొలగించే విధానానికి తుదిరూపు ఇచ్చామని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు.

15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపై తిరిగేందుకు అనుమతించబోమని చెప్పారు. వాహనాల స్క్రాప్‌ను ఆటో విడిభాగాల తయారీకి ఉపయోగిస్తే ధరలు తగ్గుముఖం పట్టి భారత్‌ ఆటో హబ్‌గా ఎదిగేందుకూ ఉపకరిస్తుందని మం‍త్రి చెప్పుకొచ్చారు. చెత్త నుంచి వాహనాలకు ఉపయోగపడే ప్లాస్టిక్‌, రబ్బర్‌, అల్యూమినియం, రాగి వంటి ముడిపదార్ధాలను చౌకగా సమీకరించుకోవచ్చని అన్నారు. 

Back to Top