పోకెమాన్తో నింటెండో జాక్పాట్! | 'Pokemon Go' More Than Doubles Nintendo's Stock Price | Sakshi
Sakshi News home page

పోకెమాన్తో నింటెండో జాక్పాట్!

Jul 20 2016 8:21 AM | Updated on Sep 18 2018 7:40 PM

పోకెమాన్తో నింటెండో జాక్పాట్! - Sakshi

పోకెమాన్తో నింటెండో జాక్పాట్!

ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో గేమ్... దాన్ని రూపొందించిన నింటెండోను ఎక్కడికో తీసుకెళుతోంది.

15 రోజుల్లో రెట్టింపైన షేరు
42 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ

టోక్యో: ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో గేమ్... దాన్ని రూపొందించిన నింటెండోను ఎక్కడికో తీసుకెళుతోంది. జపాన్ గేమ్ మేకింగ్ కంపెనీ అయిన నింటెండో షేరు ధర గడచిన పక్షం రోజుల్లోనే ఏకంగా రెట్టింపైపోయింది. అలాగని ఇదేమీ చిన్నాచితకా షేరు కాదు. జూలై 6న నింటెండో గేమ్ విడుదలయ్యే నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లుగా ఉంది. ""
మంగళవారం ఒక్కరోజే టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ షేరు ధర 14 శాతం పెరగటంతో దీని మార్కెట్ విలువ ఏకంగా 42 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2.85 లక్షల కోట్లన్నమాట. మంగళవారం 14 శాతం పెరగటంతో షేరు ధర కూడా 31,700 యెన్‌లకు (300 డాలర్లకు) చేరింది. చిత్రమేం టంటే మంగళవారం టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడైన మొత్తం షేర్లలో నాలుగోవంతు నింటెండో కంపెనీవే. అంటే చేతులు మారిన ప్రతి నాలుగు షేర్లలో ఒకటి నింటెండో షేర్ కావడం విశేషం.

పోకెమాన్ గో అంటే!!
నింటెండోతో కలసి గూగుల్ మ్యాప్స్‌ను వినియోగిస్తూ నియాంటిక్ సంస్థ రూపొందించిన పోకెమాన్ గో స్మార్ట్ ఫోన్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన లభిస్తోంది. గత  కొన్నేళ్లుగా కష్టాల్లో ఉన్న నింటెండో కంపెనీకి ఈ పోకెమాన్ గేమ్ కారణంగా తాత్కాలికంగా ఊరట లభించిందని నిపుణులంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement