గూగుల్‌ ఫోన్లపై భారీ తగ్గింపు | Pixel 2, Pixel 2 XL Price in India Slashed With Limited Period Cashbacks, Discounts | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ఫోన్లపై భారీ తగ్గింపు

Dec 22 2017 2:04 PM | Updated on Dec 22 2017 2:15 PM

 Pixel 2, Pixel 2 XL Price in India Slashed With Limited Period Cashbacks, Discounts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  గూగుల్‌ పిక్సెల్‌ 2,  పిక్సెల్‌ 2 ఎక్స్‌ ఎల్‌  ధరలు భారీగా తగ్గాయి.  హాలిడే సీజన్‌ లో పరిమత కాలం ఆఫర్‌ కింద ఈ తగ్గింపును అందిస్తున్నట్టు  గూగుల్‌ శుక్రవారం ప్రకటించింది. క్రెడిట్ కార్డు చెల్లింపుపై  డిసెంబర్‌  31 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉన్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్‌   స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

 పిక్సెల్ 2 64జీబీ,128జీబీ  వేరియంట్లకు  రూ. 11,001పరిమిత కాలం డిస్కౌంట్‌ అందిస్తోంది. పిక్సెల్ 2ఎక్స్‌ఎల్‌ 64జీబీ, 128జీబీ  వేరియంట్లపై రూ. 5.001 తగ్గింపు.  దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో   క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తోంది.  

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు  కొనుగోలు ద్వారా రూ. 8వేల డిస్కౌంట్‌తో  పిక్సెల్ 2 (64జీబీ)  రూ. 41,999కి (ఎంఆర్‌పి రూ.61వేలు)  లభించనుంది.  పిక్సెల్ 2 128జీబీ రూ. 50,999 (అసలు ధర రూ 70,వేలు), పిక్సెల్ 2 ఎ‍క్స్‌ఎల్‌  64  జీబీ రూ. 56,999  (అసలు ధర రూ. 73 వేలు),  అలాగే 128 జీబీ వెర్షన్‌ రూ.65,999 (అసలు ధర రూ.82వేలు) ధరలో అందుబాటులో ఉంటుంది.
 
కొనుగోలు చేసిన 90 రోజుల్లో  డిస్కౌంట్‌  క్రెడిట్  అవుతుంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీకి మాత్రమే  వర్తించే క్యాష్‌ బ్యాక్‌ ఆ ఫర్ డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ   ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement