పీఎఫ్ బ్రీఫ్స్ | PF briefs | Sakshi
Sakshi News home page

పీఎఫ్ బ్రీఫ్స్

May 23 2016 2:32 AM | Updated on Sep 2 2018 3:34 PM

ఎల్‌ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ సంస్థ పేరు మారింది. ఇక నుంచి దీన్ని ఎల్‌ఐఈసీ మ్యూచువల్ ఫండ్‌గా పిలుస్తారు.

ఇక ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్
ఎల్‌ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ సంస్థ పేరు మారింది. ఇక నుంచి దీన్ని ఎల్‌ఐఈసీ మ్యూచువల్ ఫండ్‌గా పిలుస్తారు. భాగస్వామ్య కంపెనీ నొమూరా స్థానంలో కార్పొరేషన్ బ్యాంక్, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు వాటాదారులుగా చేరినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త లోగోను ఆవిష్కరించారు.
 
మేక్‌మై ట్రిప్‌తో బుక్‌మై ఫారెక్స్ జట్టు
ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్‌తో విదేశీ మారకద్రవ్య సంస్థ బుక్ మై ఫారెక్స్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా మేక్ మై ట్రిప్ ఆన్‌లైన్ ద్వారా బుక్ మై ఫారెక్స్ సేవలను పొందవచ్చు. దీనివల్ల 200 దేశాలకు మేక్ మై ట్రిప్ ఖాతాదారులు సులభంగా నగదును పంపించుకునే వెసులుబాటు లభించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement