పేటీఎం మాల్‌కు భారీ నష్టాలు | Paytm Mall posts loss of Rs 13 crore in 7 months | Sakshi
Sakshi News home page

పేటీఎం మాల్‌కు భారీ నష్టాలు

Oct 10 2017 1:22 PM | Updated on Oct 10 2017 1:22 PM

Paytm Mall posts loss of Rs 13 crore in 7 months

ముంబై : పేటీఏం అనుబంధ సంస్థ పేటీఎం మాల్ భారీ నష్టాలను నమోదుచేసింది. ఇటీవలే ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థకు ఏడు నెలల కాలంలోనే రూ.13 కోట్ల నష్టాలు వాటిల్లయ్యాయి. 2016 ఆగస్టు నుంచి 2017 మార్చి వరకు రిపోర్టును రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ.20 కోట్లుంటే, రిజర్వులు, సర్‌ప్లస్‌లు రూ.1,284 కోట్లు ఉన్నట్టు ఫైలింగ్‌లో తెలిపింది. పేరెంట్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేటీఎం మాల్‌ను ఏర్పాటుచేసింది. 2016 ఆగస్టు 16లో ఏర్పాటైన దీన్ని పేటీఎం పేమెంట్స్‌ యాప్‌ నిర్వహిస్తోంది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మకు దీనిలో 12 శాతం వాటా ఉంది. ఇతర వాటాదారులు చైనీస్‌ ఇంటర్నెట్‌ దిగ్గజం అలీబాబా, సైఫ్‌ పార్టనర్లు.  

పేటీఎం మాల్‌కు ఇవి తొలి ఏళ్లని, దీన్ని విజయవంతమైన టెక్‌ బిజినెస్‌గా అభివృద్ధి చేయడానికి తాము దీర్ఘకాల దృష్టికోణాన్ని కలిగి ఉన్నట్టు పేటీఎం మాల్‌ అధికార ప్రతినిధి చెప్పారు. తమ బ్రాండ్‌కు పర్యాయపదంగా ఉన్న విశ్వసనీయ రిటైల్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడానికి తాము సహాయ పడతామని తెలిపారు. తమ ఆన్‌లైన్‌ టూ ఆఫ్‌లైన్‌ మోడల్‌ ద్వారా ఒకే రకమైన అనుభూతిని అందిస్తామన్నారు. తమ వ్యాపారాల్లో సహకారం కోసం 2000 మందిని నియమించుకునే ప్రణాళికను కంపెనీ ఇటీవలే ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement