పెట్టుబడుల పెంపుపై దృష్టి... | P&G CEO meets Modi, discusses Make in India | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల పెంపుపై దృష్టి...

Sep 28 2016 12:39 AM | Updated on Aug 24 2018 2:20 PM

పెట్టుబడుల పెంపుపై దృష్టి... - Sakshi

పెట్టుబడుల పెంపుపై దృష్టి...

ప్రధాని నరేంద్రమోదీతో న్యూఢిల్లీలో మంగళవారం ప్రోక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవిడ్ టేలర్ నేతృత్వంలోని కంపెనీ అత్యున్నత స్థాయి బృందం సమావేశమయ్యింది.

ప్రధాని నరేంద్రమోదీతో  న్యూఢిల్లీలో మంగళవారం ప్రోక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవిడ్ టేలర్ నేతృత్వంలోని కంపెనీ అత్యున్నత స్థాయి బృందం సమావేశమయ్యింది. ప్యాకేజ్డ్ గూడ్స్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజంగా పేరున్న పీ అండ్ జీ... భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి డేవిడ్ టేలర్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దేశంలో శానిటరీ వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీ వినియోగం వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.  మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తమను ఆకర్షిస్తున్నట్లు డేవిడ్ టేలర్ పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2013లో సంస్థ భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement