అప్పుడే లక్ష ఫోన్ల అమ్మకాలు! | Over 1 lakh units samsung Galaxy S7 series sold in first two days | Sakshi
Sakshi News home page

అప్పుడే లక్ష ఫోన్ల అమ్మకాలు!

Mar 13 2016 2:35 PM | Updated on Sep 3 2017 7:40 PM

అప్పుడే లక్ష ఫోన్ల అమ్మకాలు!

అప్పుడే లక్ష ఫోన్ల అమ్మకాలు!

దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్ముడుపోయాయని సంస్థ తెలిపింది.

సియోల్: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్ముడుపోయాయని సంస్థ తెలిపింది. గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ హ్యాండ్ సెట్స్ శుక్రవారం 60 వేలు, శనివారం 40 వేలకు పైగా విక్రయాలు జరిగాయని ఓ అధికారిక సైట్ లో వివరాలు అప్ డేట్ చేశారు. ఈ రెండు రకాల హ్యాండ్ సెట్స్ గత నెలలో స్పెయిన్ లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ మొబైల్స్ పై స్మార్ట్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఈ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లను మంగళవారం భారత మార్కెట్‌లోకి ఆ కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఉండనున్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితంగా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement