కోలం, పొన్ను, చిట్టి ముత్యాలు!

'Only rice' Startup Founder Vikram Cakravarti interview - Sakshi

బియ్యం బ్రాండ్లకు అడ్డా ఓన్లీ రైస్‌

మైసూర్‌ నుంచి పేటెంట్‌ డయాబెటిక్‌ రైస్‌ దిగుమతి

 రిటైలర్లకు రూ.లక్ష; గృహాలకైతే రూ.10 వేలు రుణం

‘స్టార్టప్‌ డైరీ’తో ఓన్లీ రైస్‌ ఫౌండర్‌ విక్రమ్‌ చక్రవర్తి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కిరాణా సరుకులను కూడా ఆన్‌లైన్‌లో కొనే రోజులివి. కానీ ఏ గ్రాసరీ స్టార్టప్స్‌లోనైనా ఉప్పులు, పప్పుల వంటి వాటిల్లో లభ్యమయ్యేన్ని బ్రాండ్లు బియ్యంలో దొరకవు! ఇది చూశాక హైదరాబాద్‌కు చెందిన విక్రమ్‌ చక్రవర్తి... బియ్యాన్ని మాత్రమే విక్రయించే  ‘ఓన్లీ రైస్‌.కామ్‌’ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

ప్రస్తుతం మేం కోలం, పొన్ను, జై శ్రీరామ్, చిట్టి ముత్యాలు, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇడ్లీ రైస్, దోశ రైస్, బాస్మతీ, హెచ్‌ఎంటీ వంటి 18 రకాల బియ్యం బ్రాండ్లు విక్రయిసు ్తన్నాం. ఇవి మిర్యాలగూడ, కర్నూల్, కర్ణాటక నుంచి దిగుమతవుతాయి. ఆర్గానిక్‌ డయాబెటిక్‌ పేటెంట్‌ రైస్‌తో ప్రత్యేక ఒప్పందం ఉంది. వీటిని మైసూర్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రసుతం నెలకు 1,200–1,500 బస్తాలు విక్రయిస్తున్నాం. వీటి విలువ రూ.15 లక్షల వరకూ ఉంటుంది. కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.120 వరకూ ఉంది. కిలో బియ్యం కూడా డెలివరీ చేస్తాం. రూ.500 కంటే ఎక్కువ ఆర్డరైతే డెలివరీ ఉచితం. అంతకంటే తక్కువైతే రూ.45 డెలివరీ చార్జీ ఉంటుంది.

హోటల్స్‌కు రూ.లక్ష వరకు రుణం...
రిటైల్, హోల్‌సేల్‌ వంటి బీ2బీ వర్తకులకు, గృహ కస్టమర్లకు (బీ2సీ) రుణాలందించేందుకు ఒక ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నాం. దీనిప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లకు 30 రోజుల కాల పరిమితితో రూ.లక్ష వరకు రుణమిస్తాం. ఇక, బీ2సీలకు 14 రోజుల పాటు రూ.10 వేల క్రెడిట్‌ ఉం టుంది. ఆధార్, పాన్, ఈ–మెయిల్, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలు సమర్పిస్తే చాలు నిమిషం వ్యవధిలోపే రుణం జమ అవుతుంది. ప్రస్తుతం బీ2బీలో 40, బీ2సీ 4 వేల మంది కస్టమర్లున్నారు.

ఉచితంగా ఓన్లీ రైస్‌ ఫ్రాంచైజీ కూడా..
ఓన్లీ రైస్‌కు హైదరాబాద్‌లో నాలుగు సొంత ఔట్‌లెట్లున్నాయి. ఏడాదిలో 500కి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే ఫ్రాంచైజీ ఇస్తున్నాం. రైస్‌ మర్చంట్స్‌కు, ఇతర దుకాణాదారులకు ఉచితంగా ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ప్రతి బస్తా అమ్మకంపై 5 శాతం కమీషన్‌ తీసుకుంటాం. ప్రతి నెలా 50 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి రూ.50 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ఫిబ్రవరికి బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలను విస్తరిస్తాం. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ రూ.7 కోట్ల పెట్టుబడి పెట్టింది. త్వరలో రూ.25 కోట్లు సమీకరిస్తాం’’ అని  చక్రవర్తి వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top