వన్‌ప్లస్‌ బంపర్‌ ఆఫర్‌ : ఈ ఫోన్‌పై రూ.10 వేలు తగ్గింపు

OnePlus 6T 8GB Model gets big Price Cut - Sakshi

సాక్షి, ముంబై :  చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు,  ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ మేకర్‌గా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్ తన లేటెస్ట్‌ స్టార్ట్‌ఫోన్‌​ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్‌ సమ‍్మర్‌ సేల్‌ లో భాగంగా వన్‌ప్లస్‌ 6టీ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.9వేల తగ్గింపు ధరతో అందిస్తోంది.  దీనికి అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై మరో 1500 రూపాయల డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది.  అంటే మొత్తం రూ.10500ల భారీ తగ్గింపు లభిస్తోందన్న మాట.

గతంలో అమెజాన్‌ ఫ్యాబ్‌ సేల్‌లో రూ.3వేలు తగ్గించిన సంస్థ తాజాగా మరో తగ్గింపును ప్రకటించింది.  ప్రస్తుతం వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌ రూ.31,499లకు లభిస్తోంది.  అద్భుతమైన ఫీచర్లతో గత అక్టోబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  కాగా  మే 14న  వన్‌ప్లస్‌ 7 పేరుతో మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్‌ చేయనుంది వన్‌ప్లస్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top