క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌

Published Thu, Nov 28 2019 11:17 AM

Ola Uber Fees May Be Capped At Ten percent - Sakshi

బెంగళూర్‌ : ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కమీషన్‌ రూపంలో ఓలా, ఊబర్‌లు అధికంగా గుంజేస్తున్నాయని క్యాబ్‌ డ్రైవర్లు వాపోతున్న క్రమంలో వారికి ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైడ్‌కు క్యాబ్‌ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్‌ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఇదే తొలిసారి. మరోవైపు క్యాబ్‌ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. నూతన మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

Advertisement
Advertisement