క్రీడా విద్యకు ఎన్‌ఎండీసీ సహకారం | nmdc support for sports education | Sakshi
Sakshi News home page

క్రీడా విద్యకు ఎన్‌ఎండీసీ సహకారం

Feb 18 2019 5:48 AM | Updated on Feb 18 2019 5:48 AM

nmdc support for sports education - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌ఎండీసీ.. క్రీడా విద్య ప్రోత్సాహానికి తన వంతు సహకారాన్ని అందించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం, టెన్‌విక్‌ స్పోర్స్‌లు సంయుక్తంగా పలు పాఠశాలల్లో అందిస్తున్న క్రీడా విద్య కార్యక్రమాలకు ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ రూ.2 కోట్లను అందించనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గౌరవ్‌ ద్వివేది, సంస్థ డైరెక్టర్‌ సందీప్‌ తులా, టెన్‌విక్‌ చైర్మన్‌ అనీల్‌ కుంబ్లే ఈమేరకు కుదిరిన ఎంఓఏలపై సంతకాలు పూర్తిచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement