మార్చిలో తయారీ పేలవం | Nikai PMI is 5-month low | Sakshi
Sakshi News home page

మార్చిలో తయారీ పేలవం

Apr 4 2018 12:29 AM | Updated on Oct 9 2018 4:06 PM

Nikai PMI is  5-month low - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ తయారీ రంగం క్రియాశీలత మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నికాయ్‌ మార్కెట్‌ తయారీ పీఎంఐ మార్చిలో 51 గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ పాయింట్లు 52.1 శాతం. నిజానికి మార్చిలో ఈ పాయింట్లు 52.8గా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

నెలవారీ సర్వే ప్రకారం– మార్చిలో కొత్త బిజినెస్‌ ఆర్డర్లు భారీగా పెరగలేదు. ఉపాధి అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. పీఎంఐ ప్రమాణాల ప్రకారం– సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటే దానిని వృద్ధి దశగానే భావించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. అయితే దేశంలో తయారీ ఇండెక్స్‌ వరుసగా గడచిన ఎనిమిది నెలల్లో 50 పాయింట్ల ఎగువనే ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement