ఐటీ జోరుతో వరుస నష్టాలకు బ్రేక్‌ | Nifty Rises After Three Sessions Of Falls | Sakshi
Sakshi News home page

ఐటీ జోరుతో వరుస నష్టాలకు బ్రేక్‌

Feb 21 2018 3:54 PM | Updated on Nov 9 2018 5:30 PM

Nifty Rises After Three Sessions Of Falls - Sakshi

స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, తన లాభాలను చివరి వరకు నిలుపుకున్నాయి. ఐటీ కంపెనీల జోరుతో వరుస నష్టాలకు బ్రేక్‌ ఇచ్చాయి. ఇక చివరికి సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంలో  33,845 వద్ద, నిఫ్టీ 37  పాయింట్ల లాభంలో 10,398 వద్ద ముగిశాయి. ఐటీ స్టాక్స్‌ నెలకొన్న బలమైన కొనుగోళ్లతో మార్కెట్లు ఈ లాభాలను ఆర్జించినట్టు విశ్లేషకులు చెప్పారు. పీఎన్‌బీలో చోటుచేసుకున్న భారీ కుంభకోణంతో గత మూడు సెషన్ల నుంచి మార్కెట్లు పడిపోతూనే ఉన్నాయి. కానీ నేడు మార్కెట్లు కొంత కోలుకున్నాయి. 

అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ తాజాగా మరో మూడు నెలల కనిష్టంలో 64.94గా నమోదైంది. రూపాయి బలహీనపడుతుండటంతో, ఐటీ కంపెనీల షేర్లకు బూస్ట్‌ వచ్చిందని, ఓవర్‌సీస్‌ మార్కెట్లలో ఐటీ కంపెనీలకు రెవెన్యూలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ 50 స్టాక్స్‌లో టెక్‌ మహింద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3 శాతం పైగా లాభపడ్డాయి. వీటితో పాటు ఐటీసీ, ఓఎన్‌జీసీలు కూడా టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. అటు మెటల్‌, ఫార్మా, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. సన్‌ఫార్మా దాదాపు 6 శాతం మేర పడిపోయి, నిఫ్టీ 50 స్టాక్స్‌లో టాప్‌ లూజర్‌గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement