ఎఫ్‌ఐఐలు అమ్మేస్తున్నాయ్‌!

Nifty likely to face selling pressure - Sakshi

దేశీయ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు దిగాయి. దీంతో సూచీలు భారీగా అమ్మకాల ఒత్తిడి చవిచూస్తున్నాయి. కాస్త పెరిగిన ప్రతిసారి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షోభ సమయంలో ఎక్కువమంది ‘‘సెల్‌ ఆన్‌ రైజ్‌’’ సూత్రం పాటిస్తున్నారు. దీంతో చిన్నపాటి పుల్‌బ్యాక్స్‌కూడా నిలబడట్లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ వ్యూహంలో మార్కెట్‌ పెరిగినప్పుడు ఏటీఎం పుట్‌ కొనుగోలు చేసి ఓటీఎం పుట్‌ను విక్రయిస్తారు. నిఫ్టీలో షార్ట్‌ పొజిషన్లు పరిశీలిస్తే ఎఫ్‌ఐఐలు కొత్త షార్ట్స్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సోమవారం విదేశీ మదుపరులు ఒకపక్క షేర్లను విక్రయిస్తూ మరోపక్క షార్ట్‌పొజిషన్లు పెంచుకున్నారు. సోమవారానికి నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల ఉమ్మడి షార్ట్‌ ఇండెక్స్‌ ఫ్యూచర్లు పెరుగుదల నమోదు చేశాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుట్‌బేర్‌ వ్యూహం బెటరని, చిన్నపాటి బౌన్సులను ఈ వ్యూహంతో క్యాష్‌ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Market News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top