వోల్వో కార్స్‌ నుంచి న్యూ ఎక్స్‌సి 60 | new xc 60 car from olvo cars | Sakshi
Sakshi News home page

Dec 17 2017 6:10 PM | Updated on Dec 17 2017 6:10 PM

కొరుక్కుపేట: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్‌ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో కూడిన న్యూ ఎక్స్‌సి 60 కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. సౌకర్యవంతంగాను, సేఫ్టీ ఫ్యూచర్‌లతో, అద్భుతమైన డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో రూపుదిద్దుకున్న న్యూ ఎక్స్‌సి 60ని చెన్నై మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రాంప్‌ తెలిపారు. చెన్నైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఎక్స్‌ సి 60 వోల్వో కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ధర రూ.55.9 లక్షలుగా నిర్ణయించామన్నారు. పవర్‌ ప్లస్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ కలిగిన రోబస్ట్‌ డీజిల్‌ ఇంజిన్‌ను పొందుపరిచామని తెలిపారు. భారతీయ రహదారులపై అత్యంత వేగంగా ఈ కారు దూసుకుపోతోందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement