పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్ నెలలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోర్డ్, టాటా మోటార్స్ అమ్మకాలు పెరిగాయి.
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్ నెలలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోర్డ్, టాటా మోటార్స్ అమ్మకాలు పెరిగాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించడంతో వడ్డీరేట్లు దిగొస్తాయని దీంతో అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యక్తం చేశారు.
మారుతీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎస్-క్రాస్ కార్లు 3,600 అమ్ముడయ్యాయి. హుందాయ్ కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ దేశీయ అమ్మకాలు(42,505) సాధించింది. క్రెటా, ఇలీట్ ఐ20, ఐ20 యాక్టివ్, గ్రాండ్ కార్ల కారణంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించామని కంపెనీ పేర్కొంది. కొత్త ఫిగో, యాస్పైర్‌ల కారణంగా ఈ పండుగల సీజన్‌లో తమ అమ్మకాలు మరింత పుంజుకోగలవని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనురాగ్ మెహరోత్ర గణాంకాల విడుదల సందర్భంగా చెప్పారు.