సెప్టెంబర్‌లో నియామకాల వృద్ధి 18 శాతం: నౌకరీ | naukri.com in Appointments | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో నియామకాల వృద్ధి 18 శాతం: నౌకరీ

Oct 13 2015 12:35 AM | Updated on Sep 3 2017 10:51 AM

సెప్టెంబర్‌లో నియామకాల వృద్ధి 18 శాతం: నౌకరీ

సెప్టెంబర్‌లో నియామకాల వృద్ధి 18 శాతం: నౌకరీ

నియామకాల జోరు కొనసాగుతోంది. నియామకాల వృద్ధి సెప్టెంబర్ నెలలో 18 శాతంగా నమోదైంది.

న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. నియామకాల వృద్ధి సెప్టెంబర్ నెలలో 18 శాతంగా నమోదైంది. టెలికం, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల వృద్ధి అధికంగా ఉంది. హైదరాబాద్‌లో నియామకాల వార్షిక వృద్ధి 25 శాతంగా నమోదైంది. రానున్న కాలంలో నియామకాల జోరు మరింత పెరిగే అవకాశముందని నౌకరీ.కామ్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నౌకరీ జాబ్ ఇండెక్స్ 18 శాతం వృద్ధితో 1,796కు పెరిగింది.

వార్షిక ప్రాతిపదికన చూస్తే.. టెలికం, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, ఐటీ, ఐటీఈఎస్, వాహన రంగ నియామకాల్లో స్థిర వృద్ధి నమోదు అయ్యిందని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి. సురేశ్ తెలిపారు. పట్టణాల వారీగా చూస్తే.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో నియామకాల వార్షిక వృద్ధి అత్యధికంగా 29 శాతంగా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement