నాట్కో మధ్యంతర డివిడెండు రూ.7 | NATCO interim dividend Rs.7 | Sakshi
Sakshi News home page

నాట్కో మధ్యంతర డివిడెండు రూ.7

Feb 7 2018 2:13 AM | Updated on Feb 7 2018 2:13 AM

NATCO interim dividend Rs.7 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా కంపెనీ నాట్కో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.7 రెండవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం క్రితంతో పోలిస్తే 11.5 శాతం అధికమై రూ.217 కోట్లకు ఎగసింది.

టర్నోవరు రూ.685 కోట్ల నుంచి రూ.573 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ.1,454 కోట్ల టర్నోవరుపై రూ.395 కోట్ల నికరలాభం నమోదైంది. మంగళవారం బీఎస్‌ఈలో నాట్కో ఫార్మా షేరు ధర ఒక దశలో ఇంట్రా డేలో 8 శాతం వరకూ నష్టపోయి రూ.841ని తాకింది. ఫలితాల నేపథ్యంలో రికవరీ జరిగి ఒకదశలో లాభపడింది కూడా. చివరకు 1 శాతం నష్టంతో రూ.904 వద్ద క్లోజయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement