మోస్ట్‌ ఎవైటెడ్‌ బైక్స్‌ లాంచ్‌ | Much-awaited Yamaha MT-15 Launched | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ ఎవైటెడ్‌ బైక్స్‌ లాంచ్‌

Mar 15 2019 4:27 PM | Updated on Mar 15 2019 5:03 PM

Much-awaited Yamaha MT-15 Launched - Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొత్త బైక్‌ మోడళ్లను ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఇండియా యమహా మోటార్‌ లాంచ్‌ చేసింది. ఎంటీ-15 పేరుతో సరికొత్త 155సీసీ బైక్‌ను కంపెనీ శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ. 1.36లక్షలు(ఎక్స్‌ షోరూం న్యూఢిల్లీ)గా నిర్ణయించింది.

ఎంటీ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఎంటీ-15 బైక్‌లో లిక్విడ్‌ కూల్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, సింగిల్‌ ఛానల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్ (ఏబీఎస్‌)‌, వేరియబుల్‌ వ్యాల్యూ యాక్చుయేషన్‌ తదితర అధునాతన ఫీచర్లు ఈ కొత్త బైక్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెటాలిక్‌ బ్లాక్‌, డార్క్‌ మ్యాట్‌ బ్లూ కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. అలాగే ట్యాంక్‌ ప్యాడ్‌, సీట్‌ కవర్‌, మొబైల్‌ హోల్డర్‌, పోలో షర్ట్స్‌, స్టికర్‌, కీ రింగ్‌ లాంటి యాక్సెసరీస్‌ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది.

ఈ ఏడాది 60వేల ఎంటీ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవీంద్ర సింగ్‌ తెలిపారు. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి ఎంటీ-03 లాంటి బైక్‌లను కూడా భారత్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. యమహా ఇప్పటికే పలు మోడళ్లను తయారుచేసింది. అయితే భారత్‌లో ఎంటీ-09 మోడల్‌ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్‌ విక్రయాలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్‌లో ఇప్పుడు ఎంటీ-15 బైక్‌ను తీసుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement