ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె. జైన్‌ | MK Jain is Deputy Governor of RBI | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె. జైన్‌

Jun 5 2018 12:35 AM | Updated on Jun 5 2018 8:08 AM

MK Jain is Deputy Governor of RBI - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.కె.జైన్‌ను ఎస్‌.ఎస్‌.ముంద్రా స్థానంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. ముంద్రా మూడేళ్ల పదవీ కాలం గతేడాది జూలైలో ముగిసింది. ‘బ్యాంకింగ్‌లో మంచి అనుభవమున్న, ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవో మహేశ్‌ కుమార్‌ జైన్‌ను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈయన పదవీ కాలం మూడేళ్లు’ అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

జైన్‌కు బ్యాంకింగ్‌ రంగంలో 30 ఏళ్ల అనుభవముంది. ఈయన 2017 మార్చి నుంచి ఐడీబీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికన్నా ముందు ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీగా పనిచేశారు. పలు బ్యాంకింగ్‌ రంగ ప్యానెల్స్‌లో కూడా సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆర్‌బీఐలో నలుగురు డిప్యూటీ గవర్నర్లున్నారు. విరాల్‌ వి ఆచార్య, ఎన్‌.ఎస్‌.విశ్వనాథన్, బి.పి.కనుంగోతో తాజాగా జైన్‌ జత కలిశారు. డిప్యూటీ గవర్నర్‌కు అలవెన్సులు కాకుండా నెలకు రూ.2.25 లక్షల వేతనం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement