మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ కొత్త జీఎల్‌ఈ ఎల్‌డబ్ల్యూబీ

ధర రూ. 88.80–89.90 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన టాప్ ఎండ్ ఎస్‌యూవీ ‘జీఎల్‌ఈ లాంగ్ వీల్‌బేస్ (ఎల్‌డబ్ల్యూబీ)’ కారులో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జీఎల్‌ఈ 450 4మ్యాటిక్ ఎల్‌డబ్ల్యూబీ, జీఎల్‌ఈ 400 డీ 4మ్యాటిక్ ఎల్‌డబ్ల్యూబీ పేర్లతో రెండు వేరియంట్లలో వీటిని విడుదలచేసింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమౌతున్న ఈ నూతన కార్ల ధరల శ్రేణి రూ. 88.80 లక్షలు – రూ. 89.90 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇవి కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని, ఎస్‌యూవీ విభాగంలో జీఎల్‌ఈ ఎల్‌డబ్ల్యూబీ కంపెనీకి మూల స్తంభం లాంటిదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి