సూపర్‌ ఫీచర్లు, బడ్జెట్‌ధర : మెయ్‌జు 16ఎక్స్‌ఎస్

Meizu 16Xs packs a 48MP Camera  - Sakshi

మెయ్‌జు 16ఎక్స్‌ఎస్

భారీ స్ర్కీన్‌,  భారీ కెమెరా, భారీ  బ్యాటరీ

 ఇన్‌ డిస్‌ప్లే  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌

బీజింగ్‌:  అధునాతన ఫీచర్లతో   చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ సంస్థ మెయ్‌జు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 16ఎక్స్‌ఎస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.  ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్‌  కెమెరా సహా ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలను రియర్‌ సైడ్‌లో ఏర్పాటు చేసింది. ఇంకా భారీ స్క్రీన్‌, ఇన్డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తోంది. అదీ బడ్జెట్‌ ధరలో.  రెండు  వేరియంట్లలో అందుబాటులోకి  రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ  ధరను  రూ.17,150 గా నిర్ణయించింది. 


మెయ్‌జు 16ఎక్స్‌ఎస్ ఫీచర్లు 
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1080 x 2232 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0 పై
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top