గ్రూప్‌ఎమ్‌లో భారీ పునర్వ్యస్థీకరణ  | Massive reorganization in GroupM | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ఎమ్‌లో భారీ పునర్వ్యస్థీకరణ 

Jan 29 2019 1:18 AM | Updated on Jan 29 2019 1:18 AM

Massive reorganization in GroupM - Sakshi

హైదరాబాద్‌: డేటా సెంట్రిక్, డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్‌ఎమ్‌లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్‌ ఎమ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సౌత్‌ ఏషియా) ప్రశాంత్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రెసిడెంట్‌ గ్రోత్‌ అండ్‌  ట్రాన్స్‌ఫార్మేషన్‌గా (సౌత్‌ ఏషియా) తుషార్‌ వ్యాస్‌ నియమితులయ్యారు. అలాగే గ్రూప్‌ఎమ్‌ కంపెనీలో ఒక విభాగమైన మైండ్‌షేర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సౌత్‌ ఏషియా) పార్థసారధి మాండ్యం, మైండ్‌ షేర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా (సౌత్‌ ఏషియా) అమిన్‌ లఖానీ నియమితులయ్యారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త పునర్వ్యస్థీకరణ తమ క్లయింట్ల విజయానికి మరింతగా దోహదపడగలదన్న ధీమాను గ్రూప్‌ఎమ్‌ వ్యక్తం చేసింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రశాంత్‌ కుమార్, తుషార్‌ వ్యాస్‌లు విజయవంతమైన ఫలితాలు అందించారని గ్రూప్‌ఎమ్‌ సౌత్‌ ఏషియా సీఈఓ శామ్‌ సింగ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement