
న్యూఢిల్లీ: మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ వాహనంగా అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కారు ధరలను పెంచింది. పలు భద్రతా ఫీచర్లను ఈ కారులో జోడించిన కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది. పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఈ కారు నూతన ధరల శ్రేణి రూ.3.65 లక్షలు నుంచి రూ.4.44 లక్షలకు చేరింది. తాజా పెంపు నిర్ణయంతో ఈ ప్రాంతంలో రూ.23,000 ధర పెరిగింది.
ఇతర ప్రాంతాల్లో ధరల శ్రేణి రూ.3.75 లక్షల నుంచి రూ.4.54 లక్షలుగా ఉంది. ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్రైవర్‌తో పాటు అతని పక్కన కూర్చున్న వ్యక్తికి సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిపింది.