మారుతి నుంచి నాలుగు కొత్త కార్లు | Maruti plans to launch four products  | Sakshi
Sakshi News home page

మారుతి నుంచి నాలుగు కొత్త కార్లు

Jan 21 2018 4:28 PM | Updated on Jan 21 2018 4:28 PM

Maruti plans to launch four products  - Sakshi

సాక్షి, పూణే : ఏడాదిన్నర వ్యవధిలో మారుతి సుజుకి నుంచి నాలుగు కొత్త ప్రోడక్టులు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని రెండంకెల విక్రయ వృద్ధితో ముగించాలని భావిస్తున్న కంపెనీ కొత్త ప్రోడక్టులతో మరింతగా సేల్స్‌ పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9-14 తేదీల్లో జరిగే ఆటో ఎక్స్‌పోలో మారుతి తన స్విఫ్ట్‌ ఆల్‌ న్యూ వెర్షన్‌ను లాంఛ్‌ చేయనుంది.

న్యూ స్విఫ్ట్‌తో పాటు సెడాన్‌, సియాజ్‌, ఎర్టిగాల న్యూ రిఫ్రెష్డ్‌ వెర్షన్స్‌ను రానున్న కొద్ది మాసాల్లో మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని మారుతి సన్నాహాలు చేస్తోంది. ఇక వాగన్‌ఆర్‌ ఆల్‌ న్యూ వెర్షన్‌ను కూడా లాంఛ్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే దీనికి మరికొంత సమయం పడుతుందని మారుతి వర్గాలు తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement