హైజంప్‌ : లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Market opens higher on positive cues from global markets - Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్‌ సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంలో 34,315గా ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 48 పాయింట్ల లాభంలో 10,548 వద్ద కొనసాగుతోంది. టెక్నాలజీ స్టాక్స్‌ మద్దతుగా నిలవడంతో, అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. వీటి ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యాయి.

అయితే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో ఆ బ్యాంకు షేర్లు నిన్నటి నుంచి భారీగా పతనమవుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో 10 శాతం మేర నష్టపోయిన పీఎన్‌బీ షేరు విలువ, నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 8 శాతం మేర కిందకి పడిపోయింది. పీఎన్‌బీతో పాటు జువెల్లరీ షేర్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. ఈ కుంభకోణంలో జువెల్లరీల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తుండటంతో, గీతాంజలి జెమ్స్‌ 18 శాతం, పీసీ జుయలరీ 5 శాతం మేర నష్టపోతున్నాయి. యాక్సిస్‌ బ్యాంకు కూడా 2 శాతం నష్టాల్లో నడుస్తోంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌, వేదాంతా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లు లాభాలు పండిస్తున్నాయి. 
 

Back to Top