జుకర్ బర్గ్ లైవ్ చాట్ చేస్తారట! | Mark Zuckerberg to connect with ISS astronauts via Facebook Live | Sakshi
Sakshi News home page

జుకర్ బర్గ్ లైవ్ చాట్ చేస్తారట!

May 28 2016 3:28 PM | Updated on Sep 4 2017 1:08 AM

జుకర్ బర్గ్  లైవ్ చాట్ చేస్తారట!

జుకర్ బర్గ్ లైవ్ చాట్ చేస్తారట!

అంతరిక్షంలోనే ఉంటూ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్న వ్యోమగాములతో ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ కొత్త పద్ధతిలో కనెక్ట్ కానున్నారు.

వాషింగ్టన్ : అంతరిక్షంలోనే ఉంటూ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్న వ్యోమగాములతో ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ కొత్త పద్ధతిలో కనెక్ట్ కానున్నారు. 2016 జూన్ 1న ముగ్గురు వ్యోమగాములతో జుకర్ బర్గ్ , ఫేస్ బుక్ లైవ్ చాట్ చేయనున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. నాసా ఫేస్ బుక్ పేజ్ లో ఎర్త్ టూ స్పేస్ కాల్ లైవ్ ను యూజర్లు వీక్షించవచ్చని తెలిపింది. ఫేస్ బుక్ లైవ్ వీడియో కాల్ ద్వారా 20 నిమిషాల పాటు ఆ వ్యోమగాములతో జుకర్ బర్గ్ చాట్ చేయనున్నారు.  ఈ చాట్ లో నాసా వ్యోమగాములు టిమ్ కోప్రా, జెఫ్ విలియమ్స్ తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి టిమ్ పీక్ తో జుకర్ బర్గ్ మాట్లాడనున్నారు.

అయితే ఎవరైనా ఔత్సాహికవంతులు వ్యోమగాములను ఏమైనా అడగదలుచుకుంటే, జుకర్ బర్గ్ లైవ్ చాట్ కు ప్రశ్నలు పంపించవచ్చని, వారి తరుఫున కూడా జుకర్ బర్గే వ్యోమగాములతో మాట్లాడనున్నట్టు నాసా తెలిపింది. ప్రశ్నలు పంపించాలనుకున్న వారు నాసా ఫేస్ బుక్ పేజీకి సమర్పించగలరని పేర్కొంది. వ్యోమగాములను తాను అడిగే ప్రశ్నలను జుకర్ బర్గ్, ఇప్పటికే నాసా పేస్ బుక్ పేజ్ కి సమర్పించారు. యూజర్ల కోసం కొన్ని ప్రశ్నలను నాసా పేస్ బుక్ పేజీలో పొందుపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement