హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో | Mahindra Scorpio Gets Mild Hybrid Technology | Sakshi
Sakshi News home page

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో

Jul 21 2016 1:17 AM | Updated on Sep 4 2017 5:29 AM

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో

దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ స్కార్పియో మోడల్‌లో కొత్త మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ధర రూ. 14 లక్షలు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ స్కార్పియో మోడల్‌లో కొత్త మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.74-14.01 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. కంపెనీ ఇందులో తొలిసారిగా ‘ఇన్‌టెలి-హైబ్రిడ్’ అనే హైబ్రిడ్ టెక్నాలజీని పొందుపరిచింది. దీని వల్ల ఇంధన వినియోగం 7% మేర తగ్గుతుందని కంపెనీ పేర్కొంది. 2.2 లీటర్ ఎం-హక్ ఇంజిన్ కలిగిన స్కార్పియో ఎస్4, ఎస్4 ప్లస్, ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడీ, ఎస్6 ప్లస్, ఎస్8, ఎస్10-2డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), ఎస్10-4డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్లలో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.  వాయిస్ మేసేజింగ్ సిస్టమ్ ఉన్న తొలి దేశీ ఎస్‌యూవీ ఇది.  6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన సీఆర్‌డీఈ ఇంజిన్‌ను తొలిసారిగా దీనిలోనే ఉపయోగించారు.

Advertisement
 
Advertisement
Advertisement