ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.5వేలే | Mafe Mobile launches 'Shine M815' at Rs 4,999 | Sakshi
Sakshi News home page

ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.5వేలే

Oct 16 2017 3:01 PM | Updated on Nov 6 2018 5:26 PM

Mafe Mobile launches 'Shine M815' at Rs 4,999 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ మేకర్‌ మాఫే మొబైల్‌  అతి తక్కువ ధరకే  4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎఫర్డబుల్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన‍్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా 'షైన్ ఎం815'  పేరుతో మరో  స్మార్ట్‌ఫోన్‌ సోమవారం  ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా నిర్ణయించింది.  బడ్జెట్ ధరలో , భారీ బ్యాటరీతో  తమ డివైస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని  సావరియా ఇంపెక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా  ప్రకటించారు.   డ్యూయల్ సిమ్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 15గంటల టాక్‌ టైంను  అందిస్తుందని తెలిపారు.


మాఫే 'షైన్ ఎం815’ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
480 x 854
1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
1 జీబి ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ మెమరీ
64 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
 5ఎంపీ  వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
2ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement