మార్కెట్లోకి లగ్జరీ మెటల్ ‘లుమినెక్స్ యునో’ | Lumineux Uno, a new type of precious metal launched in India | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి లగ్జరీ మెటల్ ‘లుమినెక్స్ యునో’

Jul 28 2016 2:21 AM | Updated on Sep 4 2017 6:35 AM

మార్కెట్లోకి లగ్జరీ మెటల్ ‘లుమినెక్స్ యునో’

మార్కెట్లోకి లగ్జరీ మెటల్ ‘లుమినెక్స్ యునో’

ప్రముఖ అంతర్జాతీయ జువెలరీ అసోసియేషన్ ‘లీడింగ్ జువెలర్స్ ఆఫ్ ద వరల్డ్’ (ఎల్‌జేఓడబ్ల్యూ) తాజాగా ‘లుమినెక్స్ యునో’

హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ జువెలరీ అసోసియేషన్ ‘లీడింగ్ జువెలర్స్ ఆఫ్ ద వరల్డ్’ (ఎల్‌జేఓడబ్ల్యూ) తాజాగా ‘లుమినెక్స్ యునో’ అనే కొత్త ప్రీమియం లగ్జరీ లోహాన్ని (మెటల్) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర గ్రాముకు రూ.120 నుంచి రూ.125 మధ్యలో ఉంది. ఈ ధర బంగారం, ప్లాటినం లోహాల ధర కన్నా చాలా తక్కువ. దీన్ని ఆభరణాల తయారీకి ఉపయోగంచవచ్చని.. అటు రిటైలర్లకు, ఇటు ఇన్వెస్టర్లకు ‘లుమినెక్స్ యునో’ ప్రత్యమ్నాయ లోహంగా ఉంటుందని ఎల్‌జేఓడబ్ల్యూ డెరైక్టర్ సంజీవ్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘లుమినెక్స్ యునో’.. బంగారం, ప్లాటినం, పల్లాడి యం, వెండి వంటి లోహాల మిశ్రమమని తెలిపారు. భారత్‌లో పలువురు కంపెనీల ద్వారా ఈ లోహాన్ని ఎల్‌జేఓడబ్ల్యూ మార్కెటింగ్ చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement