భారత్‌లోకి  లొపో మెడికల్‌ ఎంట్రీ  | Lopo Medical Entry into India | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి  లొపో మెడికల్‌ ఎంట్రీ 

May 11 2018 1:13 AM | Updated on Aug 13 2018 3:53 PM

Lopo Medical Entry into India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య పరికరాల తయారీలో ఉన్న చైనా కంపెనీ లొపో మెడికల్‌ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. 119 రకాల ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. వీటిలో ప్రధానంగా గుండె సంబంధ వైద్య పరికరాలు అగ్రదేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. తొలుత చైనాలోని ప్లాంటు నుంచి వీటిని దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తామని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆరోన్‌ లిన్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలను అందుబాటు ధరల్లో ప్రవేశపెట్టి పోటీకి తెరలేపుతామన్నారు. మెడికల్‌ హెల్త్‌కేర్‌ సర్వీసులను సైతం భారత్‌లో పరిచయం చేస్తామని వెల్లడించారు. ఔషధాల తయారీలో సైతం లొపో గ్రూప్‌ ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement