2019లో మార్కెట్‌లోకి లిథియమ్‌ అయాన్‌ సెల్స్‌

Lithium ion cells into the market in 2019 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లోనే తొలిసారిగా మేడిన్‌ ఇండియా లిథియమ్‌ అయాన్‌ సెల్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఇండియన్‌ సెల్యులర్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) అంచనా వేసింది. లిథియమ్‌ అయాన్‌ సెల్స్‌ను మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌లో విరివిగా ఉపయోగిస్తారు.

‘మునత్‌ ఇండస్ట్రీస్‌ భారతదేశపు తొలి లిథియమ్‌ అయాన్‌ సెల్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం మూడు దశల్లో రూ.799 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ప్రాజెక్ట్‌ తొలిదశ 2019 ఏప్రిల్‌ నాటికి పూర్తయి లిథియమ్‌ బ్యాటరీలు మార్కెట్‌లో అందుబాటులోకి రావొచ్చు’ అని ఐసీఏ తెలిపింది. కాగా లిథియమ్‌ అయాన్‌ సెల్‌ ప్లాంటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు అవుతోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top