చేతిలో పీసీ.. ఈ ఐడియాస్టిక్ | Sakshi
Sakshi News home page

చేతిలో పీసీ.. ఈ ఐడియాస్టిక్

Published Sun, Jun 28 2015 4:39 AM

చేతిలో పీసీ.. ఈ ఐడియాస్టిక్

ఇంట్లో అవసరాల కోసం ఓ కంప్యూటర్.. ఆఫీసులో మరోటి.. చేతిలో ఇంకోటి. ఈ రోజుల్లో ఇదంతా మామూలే అంటారా? నిజమేకానీ... ఇదంతా లెనవూ ఐడియాస్టిక్ అందుబాటులోకి రానంత వరకే. ఎందుకంటే.. పూర్తిస్థాయి పీసీ మొత్తాన్ని ఇది అరచేతిలో ఇమిడిపోయే సైజుకు తగ్గించేసింది మరి. హెచ్‌డీఎంఐ సామర్థ్యమున్న ఏ టెలివిజన్ స్క్రీన్‌కు దీన్ని తగిలించినా.. అది కాస్తా కంప్యూటర్‌గా మారిపోతుంది. ఇలాటివి చాలానే వచ్చాయిగానీ.. దీని ప్రత్యేకత ఏమిటంటారా?

ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో పనిచేయడం ఒకటైతే... రెండు గిగాబైట్ల ర్యామ్, 32 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ రెండోది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయగలగడం మరోటి. కేవలం 15 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ బుల్లి పీసీ ఖరీదు దాదాపు ఎనిమిది వేలు మాత్రమే!

Advertisement
Advertisement