అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ధర ఎంతంటే? | HP Envy Move PC launched in India Price And Features | Sakshi
Sakshi News home page

అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ఈ కంప్యూటర్ ధర ఎంతంటే?

Feb 17 2024 4:14 PM | Updated on Feb 17 2024 5:15 PM

HP Envy Move PC launched in India Price And Features - Sakshi

అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్‌పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు కంపెనీ హ్యాండిల్, ఫీట్ వంటి వాటిని అందించింది. దీంతో మనం ఒక బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లవచ్చు.

కొత్త హెచ్‌పీ ఎన్వీ మూవ్ ప్రారంభ ధర రూ.124990. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 అయిన ఈ కంప్యూటర్ టచ్ నావిగేషన్‌కు సపోర్ట్ చేసే 23.8 ఇంచెస్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే పొందుతుంది. ఆడియో కోసం బ్యాంగ్ & ఒలుఫ్‌సెన్‌ మేకర్స్ ఆడియో సిస్టమ్స్ పొందుపరిచారు. 

ఈ లేటెస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఓన్ వైడ్ విజన్ టెక్నాలజీతో అడ్జస్టబుల్ 5 మెగా పిక్సెల్ కెమెరా పొందుతుంది. ఈ కంప్యూటర్ భద్రతను లేదా సేఫ్టీకి దృష్టిలో ఉంచుకుని సంస్థ మాన్యువల్ ప్రైవేట్ షట్టర్, వాక్ అవే లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ అందిస్తోంది.

  • డిస్ప్లే: 23.8 ఇంచెస్ QHD IPS డిస్ప్లే, టచ్, 300 నిట్స్ బ్రైట్‌నెస్
  • ప్రాసెసర్: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5
  • గ్రాఫిక్స్: ఇంటెల్ UHD గ్రాఫిక్స్
  • ర్యామ్: 16జీబీ LPDDR5 వరకు
  • స్టోరేజ్: 1 టీబీ PCIe NVMe M.2 SSD
  • కెమెరా: హెచ్‌పీ వైడ్ విజన్ 5ఎంపీ
  • ఓఎస్: విండోస్ 11 హోమ్
  • పోర్ట్స్: 1 యూఎస్బీ టైప్-ఏ, 1 యూఎస్బీ టైప్-సీ, 1 HDMI పోర్ట్
  • కనెక్టివిటీ: Wi-Fi 6E, బ్లూటూత్ v5.3
  • ఛార్జింగ్: 90W
  • బరువు: 4.1 కేజీలు

హెచ్‌పీ కంపెనీ లాంచ్ చేసిన 'ఎన్వీ మూవ్' లాంటి కంప్యూటర్లు బహుశా ఇండియన్ మార్కెట్లో లేదనే చెప్పాలి, ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్ మనతోపాటు తీసుకెళ్లడం అంటే కొంత కష్టమే, అయితే దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ దేశంలో ఇదే మొదటిదై ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎన్వీ మూవ్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న PCలు చాలానే అందుబాటులో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement