భారతీయ యువతకు అపూర్వ నైపుణ్యం | ktr speech in business achivers award function | Sakshi
Sakshi News home page

భారతీయ యువతకు అపూర్వ నైపుణ్యం

Jun 30 2016 1:10 AM | Updated on Aug 15 2018 7:56 PM

భారతీయ యువతకు అపూర్వ నైపుణ్యం - Sakshi

భారతీయ యువతకు అపూర్వ నైపుణ్యం

భారతీయ యువతకు అపూర్వమైన నైపుణ్యం ఉందని, సరైన తోడ్పాటు ద్వారా ఈ నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

బిజినెస్ అచీవర్స్ అవార్డ్ కార్యక్రమంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: భారతీయ యువతకు అపూర్వమైన నైపుణ్యం ఉందని, సరైన తోడ్పాటు ద్వారా ఈ నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సింగపూర్ బుధవారం రాత్రి జరిగిన సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవంలో 200పైగా కంపెనీల సీఈఓలు, ప్రతినిధులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఎకామిక్ టైమ్స్ ఎర్నెస్ట్ యంగ్‌ల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 మందికి మంత్రి అవార్డులు అందజేశారు.

అనంతరం గుగూల్ ఈశాన్య ఆసియా రిజినల్ హెడ్ విద్యాసాగర్, స్టార్టప్ కమ్యూనిటీ రంగ నిపుణుడు శ్రీధర్ గాంధీలు నిర్వహించిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. పరిశ్రమ అవసరాలను అనుగుణంగా విద్యారంగంలో మార్పులు రావాలని, త్వరలో భారత్ నుంచి అద్భుత ఆవిష్కరణలు వస్తాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ప్రతినిధి సుచిత్రకు ఫార్మా రంగంలో బిజినెస్ అచీవర్ అవార్డు లభిచింది. 

సెల్‌కాన్‌కు ఉత్తమ తయారీదారు అవార్డు
సెల్‌కాన్‌కు ఉత్తమ తయారీదారు అవార్డు (బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్) లభించింది. దక్షిణ  భారతదేశంలో మొట్ట మొదటి యూనిట్‌ను స్థాపించి, నెలకు 5,00,000కు పైగా మొబైల్స్‌ను తయారు చేస్తున్నందుకుగానూ సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్.. మొబైల్ కేటగిరి విభాగంలో ఈ అవార్డుకు సెల్‌కాన్‌ను ఎంపికచేసింది. చిత్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ఉత్తమ తయారీదారు అవార్డును అం దుకుంటున్న సెల్‌కాన్ సీఎండీ వై.గురు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. రానున్న కాలంలో నెలకు 10,00,000లకు పైగా మొబైళ్లను తయారు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement