నిధుల సమీకరణ ప్రతిపాదనలు పంపండి | Sakshi
Sakshi News home page

నిధుల సమీకరణ ప్రతిపాదనలు పంపండి

Published Mon, Aug 1 2016 1:41 AM

నిధుల సమీకరణ ప్రతిపాదనలు పంపండి

పీఎస్‌బీలను కోరిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: మార్కెట్ నుంచి నిధుల సమీకరణపై ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ)ను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. పీఎస్‌బీలకు రూ.22,915కోట్ల నిధుల సాయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలి సిందే. దీంతో బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం ఇనుమడిస్తుందని, దాంతో నిధుల సమీకరణకు వెసులుబాటు లభిస్తుందని ఆర్థిక శాఖ భావి స్తోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు, ప్రాధాన్యేతర ఆస్తుల విక్రయం తదితర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు గల అవకాశాలపై ప్రణాళికలు పంపించాలని ఆర్థిక శాఖ కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆర్థిక శాఖ రూపొందించిన ఇంద్రధనుష్ రోడ్ మ్యాపు ప్రకారం పీఎస్‌బీలకు నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం రూ.70వేల కోట్ల నిధుల సాయం అం దిస్తుంది. అదే సమయంలో బ్యాంకులు సైతం రూ.1.1 లక్షల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలి. బాసెల్-3 నిబంధనల మేరకు బ్యాంకులకు ఈ మేరకు మూలధన నిధుల అవసరం ఉంటుంది.

Advertisement
Advertisement