జియో న్యూ స్కీం: మోర్‌ డేటా, మోర్‌ డిస్కౌంట్స్‌

Jio : Rs. 799 Prepaid Plan Offers 6.5 GB Per Day Data - Sakshi

అన్ని ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్యాక్‌లపై అదనపు డేటా

రూ. 300లకు పైన  రీచార్జ్‌లపై రూ.100 డిస్కౌంట్‌

రూ.300లోపు రీచార్జ్‌లపై 20శాతం డిస్కౌంట్‌

సాక్షి, ముంబై: రిలయన్స్‌ జియో మరో కొత్త  ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.  799 రూపాయల ప్రీపెయిడ్‌  ప్యాక్‌ను జియో కస‍్టమర్లకు అందబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో రోజుకు  6.5జీబీ డేటాను అందిస్తోంది. రూ. 799 ప్రీపెయిడ్ ప్లాన్‌పై జియో యూజర్లు 182 జీబీ హై-స్పీడ్ 4జీడేటాను  పొందవచ్చని జియో  విడుదల చేసిన ఒక ప్రకటన లో వెల్లడించింది.

కంపెనీ అందించిన  సమాచారం ప్రకారం రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లానన్‌పై అదనపు  డేటా ప్రయోజనాలను అదిస్తున్నది.  28 రోజులు వాలిడిటీతో రోజుకు  6.5జీబీ   హై-స్పీడ్ 4 జి డేటా ఉచితం. ఇంకా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. జూన్‌ 30వరకు ఈ ప్లాన్‌ రీచార్జ్‌కు అందుబాటులో ఉంటుందని జియో  తెలిపింది. 

అంతేకాదు 300 రూపాయలు, ఆపైన రీచార్జ్‌లపై 100 డిస్కౌంట్‌ను, రూ.300లోపు రీచార్జ్‌లపై 20శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.  అయితే రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాస్తవంగా  28 రోజుల వ్యవధిలో  రోజుకు  5జీబీ డేటా చొప్పున 140జీబీ డేటాను అందిస్తుంది. తాజా  రివ్యూ అనంతరం రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా ఆఫర్‌ చేస్తోందన్నమాట. కాగా రూ.149, రూ.349, రూ. 399, రూ. 449 తదిర  రీచార్జ్‌ప్లాన్లపై రోజుకు వాస్తవంగా అందిస్తున్న 4 జీజీ డేటా ఆఫర్‌ను పెంచిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top