
జీఎస్‌ఎంఏతో జియో భాగస్వామ్యం
ముంబై : భారత మహిళలకు డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ సౌకర్యాలను చేరువ చేసేందుకు అతిపెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్ జియో, జీఎస్‌ఎంఏ కనెక్టెడ్ వుమెన్ ఇనీషియేటివ్‌తో చేతులు కలిపినట్టు జియో ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, డేటా వాడకం, డిజిటల్ సేవలు పొందడంలో జెండర్ గ్యాప్‌ను నిరోధించేందుకు తమ భాగస్వామ్యం ఉపకరిస్తుందని వెల్లడించింది.
భారత్‌లో మొబైల్ సేవలు పొందడంలో పురుషులతో దీటుగా మహిళలు ముందుకు వెళ్లలేకపోతున్నారని, ఆ సేవలు యాక్సెస్ లేకపోవడం, అందుబాటు ధరలు కొరవడటం, డిజిటల్ విప్లవంలో సమ్మిళిత వృద్ధి లోపించడం వంటి కారణాలున్నాయని, జియో ఆవిర్భావం నుంచే వీటిని అధిగమించడం జరిగిందని తెలిపింది. ఇక డిజిటల్ ఇంక్లూజన్‌పై జియో దృష్టిసారించిందని, గత దశాబ్ధకాలంగా మొబైల్, ఇంటర్‌నెట్ టెక్నాలజీల పెరుగుదల మహిళా సాధికారత, ఐటీ విద్యావ్యాప్తికి ఉపకరించిందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు.