జొమాటోతో ఐటీసీ జోడీ..

సాక్షి, ముంబై: దేశంలోని ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికే బ్రాండ్ ఇమేజ్ క్రియెట్ చేసిన ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో భాగస్వామ్యంతో 'కాంటాక్ట్‌లెస్ డెలివరీస్'ని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ఇప్పటికే పుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ తో ఐటీసీ హౌటల్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జోమాటోతో భాగస్వామ్యపై ఐటీసీ హోటల్స్ అధికారి అనిల్ చాదా స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో 'కాంటాక్ట్‌లెస్ డెలివరీతో వినియోగదారులకు ఇంటి నుంచే ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి