డాన్స్‌తో అదరగొట్టిన ఈషా, శ్లోక | Isha Ambani Ghoomar Dance With Shloka Mehta At Her Engagement Party | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన వదినా మరదళ్లు

May 14 2018 8:28 PM | Updated on May 14 2018 9:10 PM

Isha Ambani Ghoomar Dance With Shloka Mehta At Her Engagement Party - Sakshi

శ్లోకా మెహతా, ఇషా అంబానీ (ఫైల్‌ ఫోటో)

ముంబై : రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఈషా అంబానీకి ఇటీవలే బిజినెస్‌ టైకూన్‌ అజయ్‌ పిరమల్‌ వారసుడు ఆనంద్‌ పిరమల్‌తో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక ఈ నెల 7న ముంబైలో ఘనంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుకలో ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీలు స్టెప్పులు వేసి తమ కూతురు వివాహ సంతోషాన్ని పంచుకున్నారు. ఈషా అంబానీ నిశ్చితార్థ వేడుక వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీతో ఈషా వేసిన డ్యాన్స్‌, తండ్రి ముఖేష్‌ అంబానీతో వేసిన స్టెపుల వీడియోలకు తెగ వ్యూస్‌ వస్తున్నాయి. తాజాగా అన్న ఆకాశ్‌ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ వేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో అదరగొడుతోంది. 

వదినా మరదలు ఇద్దరూ కలిసి ‘పద్మావత్‌’లోని ‘ఘూమర్‌’ పాటకు డ్యాన్స్‌ చేశారు. డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు ఇషా, శ్లోకాల జోడి బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ డ్యాన్స్‌ వీడియోలో ఎర్రటి లెహంగాలో శ్లోకా మెరిసిపోగా, ఐవర్‌ రంగు లెహంగాలో ఈషా జిగేల్‌మనిపిస్తోంది. కాగా వివాహం నిశ్చయమైన ఆనంద్‌, ఈషాలు ఎంతో కాలంగా మంచి స్నేహితులు. ఇటీవలే ఆనంద్‌, ఈషాకు మహాబలేశ్వర్‌ ఆలయంలో ప్రపోజ్‌ చేశాడు. ఆనంద్‌ ప్రతిపాదనకు ఈషా ఓకే చెప్పగానే, వెంటనే ఇరు కుటుంబాలు కలిసి విందు ఏర్పాటు చేయడం, అనంతరం ఎంగేజ్‌మెంట్‌ పార్టీ నిర్వహించడం జరిగింది. అటు ఆకాశ్‌ అంబానీ వివాహం కూడా ఈషా వివాహం నిశ్చయమవడానికి కొన్ని రోజుల ముందే రస్సెల్‌  మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చయమైంది. శ్లోకా మెహతా, ఆకాశ్‌ వివాహ నిశ్చితార్థ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement