ఐఫోన్ల వ్యసనాన్ని మరింత తగ్గించండి

Investors urge Apple to do more to combat iPhone addiction among kids - Sakshi

చిన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్ల వాడకం రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ల వాడకంతో పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతూనే ఉంది. దీనిపై కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాక, ఇటు కంపెనీలు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చిన్నపిల్లల్లో రోజురోజుకి పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంపై ఆపిల్‌ మరింత చర్యలు తీసుకోవాల్సిందిగా కంపెనీకి చెందిన ఇద్దరు ప్రముఖ ఇన్వెస్టర్లు వాదిస్తున్నారు. ఈ మేరకు ఈ టెక్నాలజీ దిగ్గజానికి వీరు ఓ లేఖ కూడా రాశారు. పిల్లలపై గాడ్జెట్లు, సోషల్‌ మీడియా వల్ల పెరిగిపోతున్న ప్రతికూల ప్రభావాన్ని హైలెట్‌ చేస్తూ న్యూయార్క్‌కు చెందిన జన పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌సీ, ది కాలిఫోర్నియా స్టేట్‌ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ సిస్టమ్‌ ఈ లేఖ రాశాయి.  

తమ డివైజ్‌ల్లో పిల్లలను స్మార్ట్‌ఫోన్ల వ్యసనం బారిన నుంచి కాపాడే టూల్స్‌ను మరిన్ని ఆఫర్‌ చేయాలని ఆపిల్‌ను ఈ ఇన్వెస్టర్లు కోరారు. దీంతో భవిష్యత్తులో ఆపిల్‌కు, పెట్టుబడిదారులకు ఎంతో మేలు చేకూరనుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆపిల్‌ వెంటనే స్పందించలేదు. సోషల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ వాడకంతో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై  ఏ విధంగా ప్రభావం చూపుతుందో నివేదించిన పలు రిపోర్టులను ఈ లేఖలో పేర్కొన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ క్లాస్‌రూంలో అంతరాయం సృష్టిస్తుందని, విద్యాపరమైన అంశాలపై విద్యార్థుల దృష్టిని తగ్గిస్తుందని, ఆత్మహత్య, ఒత్తిడి వంటి వాటిన బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు తమ లేఖలో తెలిపారు. తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మొబైల్‌ డివైజ్‌ల్లో ఆపిల్‌ సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను ఆఫర్‌ చేయడం ప్రారంభించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top