ఇంటర్నెట్‌ యూజర్లు@50 కోట్లు! | Internet users @ 50 crores | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ యూజర్లు@50 కోట్లు!

Feb 22 2018 12:57 AM | Updated on Feb 22 2018 12:57 AM

Internet users @ 50 crores - Sakshi

ఇంటర్నెట్‌ యూజర్లు

న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2018 జూన్‌ నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా. ఐఎంఏఐ–కంటర్‌ ఐఎంఆర్‌బీ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

∙ 2017 డిసెంబర్‌లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.34 శాతం వృద్ధితో 48.1 కోట్లకు చేరింది.

​​​​​​​∙ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2017 డిసెంబర్‌ నాటికి వార్షిక ప్రాతిపదికన 9.66 శాతం వృద్ధితో 29.5 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 14.11 శాతం వృద్ధితో 18.6 కోట్లకు పెరిగి ఉండొచ్చు. 

​​​​​​​∙ దేశీ మొత్తం ఇంటర్నెట్‌ యూజర్లలో విద్యార్థులు, యువత వాటా దాదాపు 60%. 

∙ ఇంటర్నెట్‌ను ప్రతి రోజూ వినియోగిస్తున్న వారి సంఖ్య 18.29 కోట్లుగా ఉండొచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement