కొత్త ఫీచర్‌ : 100కోట్ల మార్క్‌ దాటేసిన ఇన్‌స్టాగ్రామ్‌ | Sakshi
Sakshi News home page

కొత్త ఫీచర్‌ : 100కోట్ల మార్క్‌ దాటేసిన ఇన్‌స్టాగ్రామ్‌

Published Thu, Jun 21 2018 12:07 PM

Instagram celebrates 1 billion users by announcing IGTV video platform - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌   యూజర్లకు సంబంధించి బిలియన్‌ (100కోట్ల) మార్క్‌ను దాటేసింది. ఫేస్‌బుక్‌ సొంతమైన ఇన్‌స్టా‍గ్రామ్‌ తాజాగా ఒక వీడియో ప్లాట్‌ఫాంను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక్క నిమిషంలోపు ఉన్న వీడియోలనే పోస్ట్ ఈ పరిమితిని గంటకు పెంచింది. దీంతో ఫేస్‌బుక్‌ సొంతమైన ప్లాట్‌ఫాంలలో 100కోట్ల యాక్టివ్‌  యూజర్లను సాధించిన  నాలుగవదిగా నిలిచింది. యూట్యూబ్‌కు పోటీగా వీడియో ఐటీవీటీ (ఇన్‌స్టాగ్రామ్‌ హోమ్ స్క్రీన్లో ఒక బటన్, అలాగే స్టాండలోన్‌ యాప్‌) పేరుతో దీన్ని  ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం సెలబ్రిటీలే కాకుండా యూజర్లందరూ తమ కిష్టమైన గంట వ్యవధి గల వీడియోలను షేర్‌ చేసుకునే  అవకాశం కల్పించింది.  

ఐజీటీవీ వీడియో ఫీచర్‌  లాంచింగ్‌ సందర్భంగా  ఇన్‌స్టాగ్రామ్‌, సహ వ్యవస్థాపకుడు, సీఈవో కెవిన్‌ సిస్టో ఈ విషయాన్ని వెల్లడించారు. 2010లో లాంచ్‌ అయినప్పటినుంచి క్రమంగా పుంజుకున్న తమసంస్థ 100 కోట్ల వినియోగదారులను సాధించిందని, ఇది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు.  అలాగే ఐజీటీవీ గొప్ప ఆవిష్కారమని పేర్కొన్నారు.  జస్ట్‌ టీవీ ఆన్‌ చేసినట్టుగానే ఐజీటీవీలో వీడియోలు  ఓపెన్‌ అవుతాయని,   అలాగే ప్రత్యేకంగా సెర్చ్‌ చేయాల్సిన లేకుండానే   యూజర్ల ఫాలోవర్లు షేర్‌ చేసిన వీడియె కంటెట్‌ను వీక్షించవచ్చు.  డైరెక్టుగా వీడియోలను  ఫ్రెండ్స్‌కు షేర్‌ చేసుకోవచ్చని కెవిన్‌ సిస్టో వెల్లడించారు.  అంతేకాదు డిస్కవర్‌ మోర్‌, ఫర్‌ యూ లాంటి ఇతర ఆప్షన్‌లు కూడా లభ్యం. ఎక్కువ నిడివి వీడియోలను వీక్షించే అవకాశంతోపాటు, ఇతర వీడియోలను, ఛానల్స్‌ను చూడవచ్చని  తెలిపారు.  అలాగే  లైక్‌లు కమెంట్‌లు  చేసుకోవచ్చు.  దీంతోపాటు ఎవరైనా ఇందులో  సొంత ఛానెల్ని ప్రారంభివచ్చు. యాప్‌ లేదా వెబ్‌లో సొంత ఐజీటీవీ వీడియోలను అప్‌లోడ్‌ చేయవచ్చని కెవిన్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌లో కూడా చాలా ఈజీగా ఐజీటీవీ వీడియోలను షేర్‌ చేసుకోవచ్చని తెలిపారు.  కాగా 2012 ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement