ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ | Infosys surprises its staff with 95% variable pay | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌

Jan 15 2018 2:11 PM | Updated on Jan 15 2018 7:38 PM

Infosys surprises its staff with 95% variable pay - Sakshi

బెంగళూరు : దేశీయ రెండో టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సర్‌ప్రైజ్‌ అందించింది. డిసెంబర్‌ త్రైమాసికానికి గాను, తన ఉద్యోగులకు 95 శాతం వేరియబుల్‌ పే ను ప్రకటించింది. గత తొమ్మిది త్రైమాసికాల్లో చెల్లించిన వేరియబుల్‌ పేలతో పోల్చుకుంటే ఇదే అత్యధికం.'' ఇది చాలా అసాధారణం. మేం ఊహించనేలేదు. మాకు ఐఫోన్లు అందలేదు(మాజీ సీఈవో విశాల్‌ సిక్కా ఆధ్వర్యంలో టాప్‌లో ఉన్న ప్రతిభావంతులకు 3వేల ఐఫోన్లు అందించారు). కానీ అంతకంటే ఎక్కువగా కొత్త సీఈవో నేతృత్వంలో మాకు బూస్ట్‌ అందించారు'' అంటూ ఓ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేశాడు.

ఇటీవల ఇన్ఫోసిస్‌ తన డిసెంబరు త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆ త్రైమాసికంలో సంస్థ నికర లాభంలో 38శాతం వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. డిసెంబరు త్రైమాసికంలో సంస్థ గరిష్ఠంగా 12,622 స్థూల నియామకాలు చేపట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఈ నియామకాల సంఖ్య 10,514 మాత్రమే. మునపటి ఏడాది ఇదే త్రైమాసికంలో అయితే కేవలం 9,120 నియామకాలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది చేపట్టిన నియామకాలు చాలా అత్యధికమని విశ్లేషకులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ కూడా తమ ఉద్యోగులకు డిసెంబరు త్రైమాసికానికి గానూ 100 శాతం వేరియబుల్‌ పే అందిస్తున్నట్టు టీసీఎస్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement