ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చిన ఇన్ఫోసిస్ | Infosys beats expectations again, share price up 4% | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చిన ఇన్ఫోసిస్

Oct 11 2013 12:34 PM | Updated on Sep 1 2017 11:34 PM

ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చిన ఇన్ఫోసిస్

ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చిన ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్‌ వరుసగా రెండో త్రైమాసికంలో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. సెప్టెంబరు క్వార్టర్‌లో కంపెనీ ఆర్థిక ఫలితాలు అనలిస్టుల అంచనాలకు అనుగుణంగా వచ్చాయి.

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ వరుసగా రెండో త్రైమాసికంలో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. సెప్టెంబరు క్వార్టర్‌లో కంపెనీ ఆర్థిక ఫలితాలు అనలిస్టుల అంచనాలకు అనుగుణంగా వచ్చాయి. ఆదాయం 12,965 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2,410 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. మరోవైపు 20013-14 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాను కూడా పెంచింది. ఆదాయ వృద్ధి 6 నుంచి 10 శాతం ఉంటుందని గతంలో ఇన్ఫీ మేనేజ్‌మెంట్‌  అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాను 9 నుంచి 10 శాతానికి సవరించింది.

ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ధర 160 రూపాయల దాకా లాభపడుతూ 3,300లకు చేరువలో ట్రేడవుతోంది. 6 నెలల కిందట షేరు ధర 2300ల కంటే తక్కువగా ఉండటం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. ఇన్ఫోసిస్‌ 5 శాతం దాకా పెరుగుతుండటంతో సెన్సెక్స్‌ కూడా లాభపడుతోంది. 200 పాయింట్లకు పైగా పెరుగుతూ 20,500లకు సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్ల దాకా పెరుగతూ 6,080 పాయింట్లకు సమీపంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement