యమహా కొత్త బీఎస్‌–4 వాహనాలు | India Yamaha Motor launches BS-IV fleet of its 2-wheelers | Sakshi
Sakshi News home page

యమహా కొత్త బీఎస్‌–4 వాహనాలు

Mar 31 2017 12:53 AM | Updated on Sep 5 2017 7:30 AM

యమహా కొత్త బీఎస్‌–4 వాహనాలు

యమహా కొత్త బీఎస్‌–4 వాహనాలు

టూవీలర్‌ కంపెనీ యమహా మోటార్‌ తాజాగా బీఎస్‌–4 నిబంధనలకు అనువుగా ఉండేటా తన బైక్స్, స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్‌ చేసింది.

న్యూఢిల్లీ: టూవీలర్‌ కంపెనీ యమహా మోటార్‌ తాజాగా బీఎస్‌–4 నిబంధనలకు అనువుగా ఉండేటా తన బైక్స్, స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందులో ఎఫ్‌జెడ్‌ 25, వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌15, వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌15ఎస్, ఎఫ్‌జెడ్‌–ఎస్‌ ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్‌ ఎఫ్‌ఐ, ఫజిర్‌ ఎఫ్‌ఐ, ఎస్‌జెడ్‌ ఆర్‌ఆర్‌ బైక్స్‌ ఉన్నాయి.

ఇక ఇది ఇప్పటికే సెల్యుటో 125, సెల్యుటో ఆర్‌ఎక్స్‌ బైక్స్‌లో కొత్త వెర్షన్లను మార్కెట్‌లోకి తెచ్చింది. కంపెనీ అలాగే సైగ్నస్‌ రే జెడ్‌ఆర్, సైగ్నస్‌ రే జెడ్, సైగ్నస్‌ ఆల్ఫా, ఫాసినో వంటి స్కూటర్లను కూడా బీఎస్‌–4 నిబంధనలకు అనువుగా అప్‌గ్రేడ్‌ చేసింది. అన్ని కొత్త వేరియంట్లలో ఆటో హెడ్‌ల్యాంప్‌–ఆన్‌ (ఏహెచ్‌ఓ) ఫీచర్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement